ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో సోషల్ మీడియాలో ఏది నిజం, ఏది అబద్ధం అని కనుక్కోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన కథానాయికలు ఈ ఏఐ డీప్‌ఫేక్ (Deepfake) టెక్నాలజీ కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, ఆలియా భట్, కట్రీనా కైఫ్ వంటి ఎంతోమంది హీరోయిన్లు ఫేక్ వీడియోల బారిన పడగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి హోమ్లీ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) కూడా చేరిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో సౌత్ ఇండియాలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిన రుక్మిణి వసంత్.. తన హోమ్లీ లుక్స్, నేచురల్ నటనతో కుర్రకారు మనసు దోచుకుంది. ఇటీవల గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ (Dragon) సినిమాలోనూ ఈమె హీరోయిన్‌గా ఎంపికై మరింత పాపులారిటీ తెచ్చుకుంది. అయితే, తాజాగా ఈమె బికినీ ధరించినట్లు ఉన్న ఒక వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కానీ రుక్మిణి వసంత్ కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఏ సినిమాలోనూ, కనీసం ఫోటోషూట్స్‌లో కూడా గ్లామర్ షో లేదా స్కిన్ షో చేసింది లేదు. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ సడెన్‌గా ఈ రేంజ్ బోల్డ్ అవతారంలో కనిపించడంతో..
ఇది వందకు వంద శాతం ఏఐ టెక్నాలజీతో వేరొకరి బాడీకి రుక్మిణి ముఖాన్ని అతికించి చేసిన డీప్‌ఫేక్ వీడియోనే అని మెజారిటీ నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు, కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన కొందరు మాత్రం ఈ వీడియో నిజమే అయి ఉండవచ్చని సరికొత్త లీకులు ఇస్తున్నారు. ఆమె నటిస్తున్న రాబోయే ఒక క్రేజీ కన్నడ ప్రాజెక్ట్ లేదా బాలీవుడ్ డెబ్యూ సినిమా కోసం కథ డిమాండ్ మేరకు ఆమె ఇమేజ్ మేకోవర్ మార్చుకుందని, ఆ షూటింగ్ లొకేషన్ నుండి లీకైన విజువల్స్ ఇవని కొందరు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ వివాదాస్పద వీడియోపై హీరోయిన్ రుక్మిణి వసంత్ కానీ, ఆమె పిఆర్ టీమ్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.
