Site icon NTV Telugu

Rukmini Vasanth: గట్టిగా రెమ్యునరేషన్ పెంచేసిన రుక్మిణీ వసంత్

Rukmini Vasanth

Rukmini Vasanth

రుక్మిణి వసంత్ తెలుగు వారికి ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో పరిచయమైంది. కన్నడ నుంచి ఆ సినిమాని డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. ఆ సినిమాతో ఒక్కసారిగా ఆమె అందాల రాకుమారిగా ఎంతోమంది హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత ఈ మధ్యనే వచ్చిన ‘కాంతారా’ సినిమాతో ఆమె మరొక సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటించిన నెగిటివ్ రోల్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్
అయింది.

Also Read :Highway Robbers: సాధువుల వేషంలో.. హైవేలపై చోరీలకు పాల్పడుతున్న దొంగలు

ఇక ఏదైనా భాషలో ఒక హీరోయిన్ క్లిక్ అయింది అనగానే, తెలుగు నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఆమె తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లుగా తెలుస్తోంది. ఆమె ఇప్పటివరకు ఒక అమౌంట్ డిమాండ్ చేసేది, కానీ ‘కాంతారా’ హిట్ తర్వాత దాన్ని డబుల్ చేసినట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతానికి ఆమె ఎన్టీఆర్ 31 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది, కానీ ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. మరోపక్క, ఆమె యష్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఒప్పుకోబోయే సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ పెంచేసినట్లు ప్రచారం జరుగుతుంది, అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version