Rukmini Vasanth: AI డీప్‌ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో హోమ్లీ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) పేరిట వైరల్ అవుతున్న వివాదాస్పద బికినీ వీడియోపై ఎట్టకేలకే పూర్తి స్పష్టత వచ్చేసింది. స్విమ్మింగ్ పూల్ వద్ద వేరొకరు చేసిన ఒక బోల్డ్ ఫోటోషూట్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను ఏఐ (AI) టెక్నాలజీ సాయంతో మార్ఫింగ్ చేసి, రుక్మిణి వసంత్ ముఖాన్ని దానికి అతికించి నెట్టింట వైరల్ చేశారు. దీనిపై అటు అభిమానుల్లో, ఇటు కన్నడ సినీ వర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొనడంతో రుక్మిణి స్వయంగా రంగంలోకి దిగి ఆ ఫోటోలు నావి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ ఫొటోలు, వీడియో క్లిప్స్ అన్నీ వందకు వంద శాతం నకిలీవని (Fake), అవి ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించినవని స్వయంగా రుక్మిణి వసంత్ స్పష్టం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఆన్లైన్లో నా పేరుతో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్/AI ఫోటోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని అవి ముమ్మాటికీ నకిలీవే అని.. ఈ ఫేక్ కంటెంట్‌ను క్రియేట్ చేసిన వారిపై.. దానిని సోషల్ మీడియాలో కావాలని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రుక్మిణి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె తన లీగల్ టీమ్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు (Cyber Crime Police) అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. గతంలో రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి ఏఐ డీప్‌ఫేక్ వీడియోల బారిన పడి సైబర్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రుక్మిణి వసంత్ కూడా అదే తరహా సైబర్ వేధింపులను ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరం. అయితే, ఆమె హోమ్లీ ఇమేజ్ను దెబ్బతీయడానికే ఎవరో కావాలని ఇలాంటి పాడుపని చేశారని, ఆమె తీసుకున్న లీగల్ యాక్షన్ నిర్ణయం కరెక్ట్ అని కన్నడ అభిమానులు రుక్మిణికి మద్దతుగా నిలుస్తున్నారు.
Also Read
- Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు... అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
- Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. 'రొమాంచకం' నుంచి 'రాధా రమణ' పాట రిలీజ్!
- RAW NTR: ఊహించని ట్విస్ట్.. 'రా ఎన్టీఆర్'కు గుడ్‌బై.. అసలు ఏమైంది?
తాజావార్తలు
-
Yuvraj Singh: 2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
-
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ఏకాంతమే ఇష్టం! సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతోందంటే ?
-
Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
-
Mercedes-Benz AMG E 53: మెర్సిడెస్ బెంజ్ AMG E 53 విడుదల.. 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!