Site icon NTV Telugu

Ruhani Sharma: ‘హిట్స్’ లేకున్నా భలే ఛాన్స్ పట్టిందే!

Ruhani Sharma

Ruhani Sharma

Ruhani Sharma to Romance with Allari Naresh: ఒక్కోసారి హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా వాళ్లకు కాలం కలిసి రాక హిట్లు ఏ మాత్రం పడకుండా ఉంటాయి. తెలుగులో అందానికి కొదవలేదు కానీ మంచి హిట్ ట్రాక్ రికార్డు ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ. ఈ క్రమంలో బిజీగా ఉన్న హీరోయిన్ల వెంట దర్శక నిర్మాతలు పడుతున్నారు కానీ టాలెంట్ ఉండి పక్కన కూర్చున్న హీరోయిన్లను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ సినిమాలు లేకుండా ఇబ్బంది పడుతున్న ఒక హీరోయిన్ కి సువర్ణ అవకాశం దక్కింది. అసలు విషయం ఏమిటంటే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అల్లరి నరేష్ హీరో కొత్త సినిమా మొదలైంది కదా.

Sundeep Kishan: ‘రాయన్’లో సందీప్ ఔటాఫ్ సిలబస్.. ఇప్పుడేం చేస్తాడు?

ఈ సినిమాలో రుహాని శర్మ హీరోయిన్గా ఎంపికైంది. ఈ మధ్య కాలంలో సైన్ధవ్, ఆపరేషన్ వాలెంటైన్ అంతకుముందు హర్ లాంటి సినిమాలు చేసి ఫ్లాప్స్ అందుకున్న ఆమె ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాలో ఎంపిక కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నార్త్ భామ ఇప్పటికే గ్లామర్ గేట్లు తెరిచి హిందీ సినిమా అవకాశంతో పాటు ఒక తమిళ్ సినిమా అవకాశం కూడా దక్కించుకుంది. తెలుగులో ఆమె చిలాసౌ లాంటి సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేసింది. ఇప్పుడు ఆమె సితార లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్లో సినిమా చేసేందుకు అవకాశం దక్కించుకోవడం ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

Exit mobile version