Site icon NTV Telugu

“రుద్రమదేవి” ఖాతాలో సరికొత్త రికార్డు

Rudhramadevi Hindi Version Hits 184M+ Views On YouTube With 900K+ Likes

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం “రుద్రమదేవి”. అనుష్క, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, విక్రమ్ జీత్ విర్క్, ప్రకాశ్ రాజ్, ఆదిత్య మీనన్, నిత్య మీనన్, కాథరీన్ త్రెసా లాంటి భారీ తారాగణం తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అనుష్క 13వ శతాబ్ది కాకతీయ వంశపు రాణి రుద్రమదేవిగా నటించింది. దగ్గుబాటి రానా ఆమె ప్రియుడిగా నటించగా… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకి సంగీతం ఇళయరాజా అందించారు. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నిర్మితమైన ఈ 3డి చారిత్రక చిత్రం 2015 అక్టోబరు 9న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి తెలుగులో విభిన్నమైన స్పందన వచ్చింది. తాజాగా “రుద్రమదేవి” ఖాతాలో సరికొత్త రికార్డు చేరింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ యూట్యూబ్ లో విడుదలై భారీ వ్యూస్ ను, లైక్స్ ను సాధించడం విశేషం. ఇప్పుడు “రుద్రమదేవి” హిందీ వెర్షన్ 184+ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 900+కే లైక్స్ సాధించడం విశేషం. మొత్తానికి తెలుగులో యావరేజ్ గా నిలిచిన చిత్రాల హిందీ వెర్షన్ లు మాత్రం యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి.

Exit mobile version