Site icon NTV Telugu

యూరోప్ కు “ఆర్ఆర్ఆర్” టీం ప్రయాణం

RRR

RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే షెడ్యూల్‌ ను యూరప్‌లో చిత్రేకరించనున్నారు. దీనితో మొత్తం షూటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ సినిమాలోని చివరి పాటను ఈ యూరప్ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారు. మేకర్స్ ఈ పాట చిత్రీకరణ కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. అక్కడి మనోహరమైన ప్రదేశాలలో తెరకెక్కించే ఈ సాంగ్ తెరపై విజువల్ వండర్ గా ఉండబోతోందట. త్వరలోనే “ఆర్ఆర్ఆర్” టీం మొత్తం యూరోప్ కు ప్రయాణం కానుంది. ఈ యూరోప్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి వస్తుంది. ఆగస్టు చివరి వరకు ఈ షెడ్యూల్ కొనసాగే అవకాశం ఉంది.

Read Also : “లెఫ్టినెంట్ రామ్” హీరోయిన్ ఫస్ట్ లుక్

“ఆర్ఆర్ఆర్” మూవీని ఈ సంవత్సరం అక్టోబర్ 13న థియేట్రికల్ రిలీజ్‌కి ప్లాన్ చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలస్యం అయినప్పటికీ మేకర్స్ ముందుగా ప్రకటించిన విడుదల తేదీనే సినిమాను రిలీజ్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ శరవేగంగా ప్రమోషన్‌లను ప్రారంభిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పిస్తుందని మొత్తం చిత్ర పరిశ్రమ ఆశిస్తోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో భారీ తారాగణం ఉన్న విషయం తెలిసిందే.

Exit mobile version