Joju George to Play Villain Role in Rowdy Janardhana: ఇటీవల ‘రణబాలి’తో సూపర్ హిట్ అందుకున్న ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ మరో ఆసక్తికరమైన మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా మూవీ ‘రౌడీ జనార్ధన’. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
రౌడీ జనార్ధనలో ప్రతినాయకుడి పాత్ర కోసం తొలుత తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆయన రూ.20 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారట. ఆ తర్వాత మేకర్స్ మరో తమిళ నటుడు ఎస్.జే. సూర్యను సంప్రదించగా.. ఆయన రూ.15 కోట్లు అడిగారట. చివరకు మలయాళ నటుడు జోజు జార్జ్‌ను విలన్ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విలన్ రోల్ కోసం జోజు జార్జ్ తక్కువే తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రౌడీ జనార్ధనలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా.. సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జోజు జార్జ్ విలన్‌గా నటిస్తే ఈ ప్రాజెక్ట్‌కు మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. విభిన్నమైన పాత్రలు, సహజమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న జోజు జార్జ్.. విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్‌కు ఉన్న మాస్ ఇమేజ్ను మరింత బలపరిచేలా యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

