Roopayanamah : ఆసక్తి రేపుతున్న ‘రూపాయనమ:’ ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బు చుట్టూ తిరిగే కథలు ప్రేక్షకులను ఎప్పుడూ కుర్చీ అంచున కూర్చోబెడతాయి. అందులోనూ ‘కోటి రూపాయల లాటరీ’ తగిలితే ఆ వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి? వాళ్ళ ఆశలు, భయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయి? సరిగ్గా ఇదే సెన్సేషనల్ పాయింట్‌తో థియేటర్లలో సంచలనం సృష్టించడానికి వస్తున్న విభిన్న చిత్రమే ‘రూపాయనమ:’. చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పావని సాగి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు అరవింద్ రెడ్డి దర్శకత్వం వహించారు.
కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో ముందుండే టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ ప్రాజెక్ట్ కు అండగా నిలవడంతో సినిమాపై ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. తాజాగా ఆయన చేతుల మీదుగా ‘రూపాయనమ:’ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ సాంగ్ ను మేకర్స్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఒకవైపు కోటి రూపాయల లాటరీ అనే క్యూరియాసిటీ పాయింట్, దానికి తోడు సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్ కు వస్తున్న ట్రెమండస్ రెస్పాన్స్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా మ్యాజిక్ చేసేలా కనిపిస్తోంది. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలకు సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు రావడం అరుదు. కానీ, ఈ సినిమా సెన్సార్ సభ్యులను సైతం ఆకట్టుకోవడం విశేషం అని టీం చెబుతోంది.
అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు తమ సహజమైన నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. రిషి.ఎం అందించిన సంగీతం, జింక వరుణ్ నాయుడు విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వనున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి