Site icon NTV Telugu

Prince : సైకలాజికల్ థ్రిల్లర్ “కలి” నుండి రొమాంటిక్ మెలొడీ సాంగ్ రిలీజ్

Prince

Prince

లాంగ్ గ్యాప్ తర్వాత సరికొత్త కథాంశంతో యంగ్ హీరో ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. చాలా కాలం తర్వాత ప్రిన్స్ హీరోగా రానున్న చిత్రం కలి. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజగా “కలి” మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్ ‘హల్లో హల్లో..’ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Also Read : Bahirbhoomi: “బహిర్భూమి” నాకు మంచి పేరు తీసుకొస్తుంది: అజయ్ పట్నాయక్

‘హల్లో హల్లో..’ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి బ్యూటిఫుల్ లిరిక్స్ అందించగా, జీవన్ బాబు (జె.బి.) ప్లెజెంట్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. హైమత్ హైమత్ అహ్మద్, అదితీ భావరాజు మంచి ఫీల్ తో పాడారు. ‘హల్లో హల్లో హల్లో పూలదారుల్లో పాదం వేద్దాం ఓ పిల్లో, ఛల్లో ఛల్లో ఛల్లో రంగు రంగుల్లో జీవించేద్దాం ఛల్ ఛల్లో, కలవని దూరం దూరం నిన్న వరకు, అడుగులో అడుగేసేద్దాం చివరి వరకు..’అంటూ రొమాంటిక్ గా సాగుతుందీ పాట. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కథకు ‘హల్లో హల్లో..’ పాట కలర్ ఫుల్ పిక్చరైజేషన్ తో కొత్త ఫ్లేవర్ తీసుకొస్తోంది. సరోకొత్త కథాశం తో రానున్న ఈ సినిమాకు నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి ద్వయం సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version