Rolugunta Suri: ఆసక్తికరంగా ‘రోలుగుంట సూరి’ ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’. నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ కుమార్ పల్లా దర్శకత్వం వహిస్తున్నారు. తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమాలు సైలెంట్‌గా వచ్చి పెద్ద సంచలనం సృష్టిస్తాయి. దర్శకుడు అనిల్ కుమార్ పల్లా హృదయాన్ని తాకే అద్భుతమైన సబ్జెక్ట్‌ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ లుక్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. సినిమా కూడా అదే స్థాయిలో అద్భుతంగా ఉండబోతోందనే నమ్మకం నాకు ఉంది. చిత్రయూనిట్‌కు నా అభినందనలు” అని అన్నారు.
దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ – “మా సినిమా ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించిన రాజేంద్రప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన అభినందనలు మాకు మరింత నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చాయి. అదే ఉత్సాహంతో సినిమాను మరింతా అద్భుతంగా చిత్రించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం,” అని తెలిపారు. నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ** – “‘రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైన ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మా టీమ్‌లో ప్రతి ఒక్కరు తమ ప్రతిభను అద్భుతంగా కనబరుస్తున్నారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా అవుతుందనే నమ్మకం మాకు ఉంది,” అని అన్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
-
CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!