NTV Telugu Site icon

Roja: చాలా రోజుల తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రోజా..

Untitled 1

Untitled 1

టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ లలో రోజా ఒకరు. తెలుగులో ఆ రోజుల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. తర్వాత మెల్లిగా ఈమెకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో, బుల్లితెరపై అడుగు పెట్టి మోడ్రన్ మహాలక్ష్మి , జబర్దస్త్ వంటి పలు షోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేసింది. ఇక దీం తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, రోజా జబర్దస్త్‌ షో కంటిన్యూ చేస్తూ వచ్చింది. అంతే కాకుండా పలు సినిమాల్లో గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

Also Read:Nagendra Babu : మహేశ్ బాబు గుణం అలాంటిది: నాగేంద్రబాబు

ఇక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజా తర్వాత బుల్లితెరకు దూరంగా ఉంటూ.. పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేసింది. కానీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా రోజుల వరకు రోజా కనిపించలేదు. అయినప్పటికి ఇండస్ట్రీలో మాత్రం తన ఫేమ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. ఇక చాలా రోలుల తర్వాత రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో కి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇందులో రోజా తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. రోజా తో పాటు శ్రీకాంత్ , రాశి ఈ షోలో జడ్జీలుగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ షో మార్చి 2 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. దీంతో రోజా మరోసారి బుల్లితెరపై సందడి చేయనుంది. ఇక ఈ ప్రోమో చూసిన రోజా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.