NTV Telugu Site icon

Roja: అల్లు అర్జున్ పేరు లాగుతూ పవన్ కళ్యాణ్ పై రోజా విమర్శలు

Roja Pawan

Roja Pawan

రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ చేంజర్’. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు. అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి సన్నిహితులను తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. కుటుంబాలకు చెరొక ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే పవన్ కూడా ఈ అంశం మీద స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ స్పందన సరిగా లేదంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు.

The Raja Saab : రెబల్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరుస్తున్న రాజా సాబ్

గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ లు మరణించడం బాధాకరం. తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి 3 రోజులైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శించకపోవడం అమానవీయం. తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప టీమ్ మానవత్వం తో వ్యవహరించలేదన్న పవన్ ఇప్పుడు 3 రోజులైనా మరణించిన అభిమానుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణం. ఆ యువకుల తల్లులు, కుటుంబాల కన్నీటి రోదన కనిపించడం లేదా..? పరామర్శించకపోగా వీరి మరణానికి గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వెయ్యకపోవడం కారణం అంటూ చౌక బారు రాజకీయం చెయ్యడం తగునా..? పవన్ కళ్యాణ్ గారు. 7 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీ ప్రభుత్వ మే కదా..? 7 నెలలుగా ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నది మీరు కాదా..? పవన్ కళ్యాణ్.. రోడ్డు వల్ల చనిపోతే వీరిద్దరి మరణానికి మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు కారణం కాదా..? మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోండి అని అంటూ ఆమె విమర్శించారు.

Show comments