Site icon NTV Telugu

Rocking Rakesh : కేసీఆర్ సినిమాపై దుష్ప్రచారం.. వీడియో రిలీజ్ చేసిన రాకింగ్ రాకేష్

Rocking Rakesh

Rocking Rakesh

నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్ ‘జబర్దస్త్’తో మంచి గుర్తింపు సంపాదించాడు. ఆయన గత ఏడాది ‘కె.సి.ఆర్.’ అనే పేరుతో ఒక సినిమా రూపొందించారు. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి డీసెంట్ టాక్ కూడా అందుకుంది.
అయితే, తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు రాకింగ్ రాకేష్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టర్‌లో, రాకింగ్ రాకేష్‌ను ‘కె.సి.ఆర్.’ కుటుంబం తనను ఆగం చేసి, సినిమా చేయించి అప్పులపాలు చేసినట్లు ఉంది. దీనిపై రాకింగ్ రాకేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది.

Also Read :Priyanka Chopra – Globe Trotter: గ్లోబల్ హీరోయిన్’ను చీరలో దింపిన జక్కన్న

తాజాగా శివమాల ధరించిన రాకింగ్ రాకేష్ ఒక వీడియో విడుదల చేసి, ఇది కరెక్ట్ కాదని అన్నారు. తాను ఎప్పుడూ ఆ ఇంటర్వ్యూ ఇవ్వలేదని, ఎవరో కావాలనే దీనిని పుట్టించారని అన్నారు. కేసీఆర్ మీద అభిమానంతోనే ఆ పేరు పెట్టుకున్నానని, ఇప్పటికీ ఆ అభిమానం అలాగే ఉందని ఆయన అన్నారు. ఆ సినిమా తనకు చాలా కలిసి వచ్చిందని, ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో మరో సినిమా డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నానని అన్నారు.

Also Read :Pawan Kalyan: అటవీ భూముల జోలికి ఎవరు వచ్చినా ఉపేక్షించం.. డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..!

“ఇలాంటి వార్తలు పుట్టించి, తద్వారా వచ్చే డబ్బుతో తినే తిండి కూడా ఒక తిండేనా?” అని ఆయన అన్నారు. “మీకు ఇది ఒక పోస్టర్ అయి ఉండవచ్చు, కానీ దీనివల్ల ఎంతో మంది జీవితాలు తారుమారవుతున్నాయి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేసే ముందు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని ఆయన కోరాడు.

Exit mobile version