NTV Telugu Site icon

మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..?

Roar Of RRR - RRR Making Video Out Now

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సన్నివేశాలు, స్టంట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మేకింగ్ వీడియో చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Read Also : “టక్ జగదీష్” రిలీజ్ డేట్ ఫిక్స్ ?

కాగా ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఆగస్టులో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు రాజమౌళ. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ ఏడాది అక్టోబర్ 13న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్నీ తాజాగా మేకింగ్ వీడియోలో కూడా తెలియజేశారు. మేకింగ్ వీడియోనే ఇలా ఉంటే ఈ చిత్రం కోసం రాజమౌళి ప్లాన్ చేసిన నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయో అనే చర్చ మొదలైపోయింది. ఆ విషయం గురించి సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ అయిన మేకింగ్ వీడియో అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”వీడియోపై ఓ లుక్కేయండి మరి.