Site icon NTV Telugu

Ritu Varma : ఇలాంటి కథలో నటించడం నా అదృష్టం..

Ritu Varma, ‘devika And Daani’,

Ritu Varma, ‘devika And Daani’,

టాలీవుడ్‌లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ. రీసెంట్ గా ‘మజాకా’ మూవీతో మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు ప్రజంట్ ‘దేవిక అండ్ దానీ’ అనే వెబ్ సిరీస్‌తో రాబోతుంది. ఇది ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్. దర్శకుడు బి.కిశోర్ రూపొందించగా, సుధాకర్ చాగంటి నిర్మాతగా వ్యవహరించారు. సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ వెజిసిరీస్, ఈ నెల 6న ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్ స్టార్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా

Also Read : Bollywood : మొత్తనికి అమీర్‌ఖాన్‌ కోసం దిగొచ్చిన OTT సంస్ధ..

మీడియా సమావేశం అయ్యారు మూవీ టీం.. ఈ సందర్భంగా రీతూ వర్మ మాట్లాడుతూ.. ‘ఇలాంటి కాన్సెప్ట్‌తో సిరీస్ చేయాలని నేనెప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ క్రమంలోనే ‘దేవిక అండ్ డానీ’ లాంటి నిజాయితీతో కూడిన కథ నా దగ్గరకు వచ్చింది. ఇందులో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు కిశోర్ దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సాధారణంగా ఊర్లో ఉండే అమ్మాయిల్ని.. ఈ పని చేయి, ఆ పని చేయకని ఆంక్షలు పెడుతుంటారు. అలాంటి వాళ్ళు బయటకు వెళ్తే ఎలా మారతారనే విషయాన్ని ఈ సిరీస్‌ల్లో చక్కగా చూపించారు. చాలా మంది అమ్మాయిలను చుట్టు పక్కల ఉండేవాళ్లు.. నువ్వు ఏం చేయలేవు. సాధించలేవు అని నిరుత్సాహ పరుస్తున్నారు. అలాంటి అమ్మాయిలకు ఈ ‘దేవిక అండ్ దానీ’ వెబ్‌సిరీస్ ఓ నమ్మకాన్ని ఇస్తుంది’ అని రీతూ తెలిపింది.

Exit mobile version