NTV Telugu Site icon

RGV : రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ వివాదంపై స్పందించిన లీగల్ టీమ్

Rgv

Rgv

డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ అరెస్ట్ ఎపిసోడ్‌లో ఉదయం నుండి సస్పెన్స్ కొనసాగుగుతూనే ఉంది. ఉదయం నుంచి ఆర్జీవీ ఆఫీస్‌ ఎదుట ఏపీ పోలీసులు రామ్ గోపాల్ డెన్ ఎదుట వేచిచూస్తున్నారు. వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకు వెళ్లాలని పోలీసులు రెడీ గా ఉన్నారు. కానీ సెర్చ్‌ వారెంట్‌ లేకపోవడంతో ఉదయం నుంచి రామ్ గోపాల్ వర్మ డెన్ లోపలికి   పోలీసులు వెళ్లలేదు. ఆర్జీవీ ఎక్కడున్నారన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.దింతో చేసేదేమి లేక జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 71 RGV డెన్ నుండి ఏపీ పోలీసులు వెనుతిరిగారు.

Also Read : VD : విజయ్ దేవరకొండ ‘రౌడీ వేర్’ బ్రాండ్ కు స్పెషల్ అవార్డ్

ఈ ఉదయం ఆర్జీవి ఆఫీస్ వద్దకు చేరుకున్న ఏపీ పొలీసులు అక్కడ లేడని శంషాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో తలదాచుకున్నాడనే సమచారంతో ఆక్కడికి వెళ్లిన వెతికినా కూడా రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు దొరకలేదు . ఈ రోజు ఏపీ పోలీసుల ఎదుట విచారణకు రాకపోవడంతో ఆర్జీవి డెన్ వద్దకు వచ్చిన ఏపీ పోలీసులు.  వర్చ్యువల్ గా విచారణకు సిద్ధమని ఏపీ పోలీసులకు తెలిపిన RGV లీగల్ టీమ్. రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగత విచారణకు రాలేడని, BNSS చట్ట ప్రకారం వర్చ్యువల్ గా హాజరు అయ్యేందుకు అవకాశం ఉందన్న వర్మ తరపు లీగల్ టీమ్. ఏపీ పోలీసులు RGV ని డైరెక్ట్ గా అరెస్ట్  చేస్తే తాము చట్ట ప్రకారంగా ఎదుర్కొంటామంటున్నా లీగల్ టీమ్.  ఏపీ పోలీసులు తదుపరి ఎటువంటి చర్యలు చేపడతారు, వర్మ ను అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా లేక వెతికి మరి అరెస్ట్ చేస్తారా అనే దానిపై  సస్పెన్స్ నెలకొంది.

Show comments