NTV Telugu Site icon

RGV : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వర్మకు నోటీసులు

Rjv

Rjv

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు అందించారు. ఎక్స్‌లో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్‌ చేసి.. చంద్రబాబు, పవన్‌, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా  ప్రమోషన్‌ లో టైమ్ లో ఆనాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటోలను మార్ఫింగ్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. అయితే తాజాగా ఈ పోస్ట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్దిపాడు మండల చెందిన తెదేపా కార్యదర్శి రామ్ గోపాల్ పై ఎం.రామలింగం అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు.

Also Read : KA : కిరణ్ అబ్బవరం ‘క’ మలయాళం రిలీజ్ ఎప్పుడంటే..?

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేసారు.  ఆర్జీవీ పై ఫిర్యాదులు నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు మద్దిపాడు ఎస్సై శివరామయ్య.  మరోవైపు అమరావతి లోని తుళ్లూరులోనూ ఆర్జీవీపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌ ఫొటోలను రామ్‌గోపాల్‌ వర్మ గతంలో మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు  పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరి విచారణకు రామ్ గోపాల్ వర్మ వస్తారో రారో చూడాలి.

Show comments