వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మఫై ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు, అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించ పరుస్తూ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో పాటు సినిమాలు తెరక్కించాడు ఆర్జీవీ.
Also Read : Manchu Family : మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్.. పోరాటం ఆగదు
ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీ వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవరంపై విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు పంపగా రామ్ గోపాల్ వర్మ వాటిని తిరస్కరించడంతో పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. తనను అరెస్ట్ చేస్తారని ముందే పసిగట్టిన ఆర్జీవీ పోలీసులకు దొరక్కుండా వారికి చిక్కకుండా తప్పించకున్నాడు. అలాగే తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కు అప్లై చేసారు. అనేక వాదోపవాదనలు, వాయిదాల అనంతరం రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఆర్జీవీపై నమోదైన కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది ఏపీ హై కోర్టు. ఆర్జీవీకి అన్ని కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మరి ఆర్జీవీ పోలీసులకు సహకరిస్తాడా లేదా ఇప్పటి లాగే తాన స్టైల్ లో డుమ్మా కొడతాడా అని నెటిజన్స్ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.