NTV Telugu Site icon

Revanth Reddy: డ్రగ్స్ పై యుద్ధం.. సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్ ?

Cm Revanth Reddy

Cm Revanth Reddy

Revanth Reddy Conditions to Cinema Industry over Anti Drugs Campaign: ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి డ్రగ్స్ మీద పోరాటం చేస్తూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు తాజాగా కీలక సూచనలు చేశారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు ప్రకటించారు. సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలన్న ఆయన వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాకు ముందు డిస్ క్లెయిమర్స్ ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటి పై అవగాహన కల్పించడం లేదు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..

Akhil: అయ్యగారు ఎక్కడా తగ్గట్లేదు.. ఈసారి లెక్కేసి కొట్టడమే!

అంతేకాదు ఇకమీదట ఎవరైతే టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ ప్రభుత్వం వద్దకు వస్తారో వారి నుంచి ఆ సినిమాలో నటించిన స్టార్ల చేత డ్రగ్స్ అవగాహన వీడియో చేయించి రిలీజ్ చేయించాలని అప్పుడే రేటు పెంచుకునే అవకాశం కల్పించేలా ఒక ప్రీ కండిషన్ పెడుతున్నట్టు ఆయన ప్రకటించారు. డ్రగ్స్, సైబర్ నేరాలు పై సినిమా కు ముందు కానీ సినిమా తరువాత అయిన 3 నిమిషాలు వీడియోతో అవగాహాన కల్పించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదన్న రేవంత్ రెడ్డి అలాంటి నిర్మాతలకు , డైరెక్టర్ లకు , తారాగణంకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవన్నారు. ఇక ప్రభుత్వం తీసుకుని ఈ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాల విషయంలో సినిమా థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలు పై థియేటర్లులో ప్రసారం చేయక పోతే మీ థియేటర్ల అనుమతి విషయంలో కూడా పునరాలోచించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.