Site icon NTV Telugu

Retro : సూర్య కౌంట్‌డౌన్ స్టార్ట్..

Surya Retro

Surya Retro

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రెట్రో’. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీని సూర్య తన హోమ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా మే 1న గ్రాండ్ రిలీజ్‌ కాబోతున్న ఈ మూవీ నుండి, ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రిలీజైన కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజు మార్క్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్ గా మనం చూసే ట్రైలర్ కి కాస్త భిన్నంగా.. రెండున్నర నిమిషాల నిడివితో, ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా, ప్రధాన పాత్రల అన్నిటినీ పరిచయం చేస్తూ, వివిధ సన్నివేశాల్లో నటీనటుల హావభావాలను చూపిస్తూ,ఆడియన్స్ కు అసలు అర్థం కాకుండా ఈ ట్రైలర్ వీడియో ని కట్ చేశారు. ఇక పోతే  ఇప్పుడు సూర్య కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది.

Also Read: Prabhas : ‘స్పిరిట్’ సినిమాలో మరో స్టార్ హీరో..!

అదేంటి అనుకుంటున్నారా.. కలీవుడ్‌ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చియాన్ విక్రమ్ ‘తంగలాన్’, సూర్య ‘కంగువా’, రజినీకాంత్ ‘వేట్టయాన్’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. బాక్సాఫీస్ దగ్గర ఊహించని రీతిలో బోల్తా కొట్టాయి. ఈ ఏడాది ప్రారంభంలో అజిత్ కూడా ‘విదాముయార్చి’ మూవీ తో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక్కరొక్కరిగా హిట్ కొడుతూ అభిమానులు అలరిస్తున్నారు. ఈ జాబితాలో ముందుగా చియాన్ విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రీసెంట్‌గా అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు సూర్య వంతు.. ‘రెట్రో’ మూవీతో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.

Exit mobile version