Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్‌’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!

Renu Desai 300kb

Renu Desai 300kb

Kashi Majili OTT: చాలా కాలం తర్వాత నటి రేణు దేశాయ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈసారి థియేటర్‌లో కాదు.. నేరుగా ఓటీటీలో. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘కాశీ మజిలీ’ (Kashi Majili) వెబ్ ఎపిసోడ్ సెప్టెంబర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రేణు దేశాయ్ నటించడంతో పాటు కథ, కథనం, సంభాషణలు కూడా అందించడం విశేషం. రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాశీ మజిలీ’ లఘు చిత్రం నేడు (2026 సెప్టెంబర్ 13, ఆదివారం) ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ETV Winలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ‘కథా సుధా’లో భాగంగా రూపొందిన ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందింది. హృదయానికి హత్తుకునే కథలను అందించాలనే ఉద్దేశంతో ఈటీవీ విన్ ప్రత్యేకంగా తీసుకొస్తున్న ‘కథాసుధ’ సిరీస్‌లో భాగంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కొన్ని ప్రేమకథలకు మరో అవకాశం దక్కాలి’ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో, మలయాళ మూవీ ‘చిన్న చిన్న ఆశై’ కథ ఆధారంగా ఈ సరికొత్త లఘు చిత్రాన్ని రూపొందించారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో చివరిసారిగా కనిపించిన రేణు దేశాయ్, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ ప్రాజెక్ట్‌తో డిజిటల్ ఓటీటీ రంగంలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు.

ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న మరో విశేషం ఏమిటంటే, ఇందులో రేణు దేశాయ్ కేవలం నటిగా మాత్రమే కాకుండా.. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. పవిత్రమైన వారణాసి (కాశీ) ఘాట్ బ్యాక్‌డ్రాప్‌లో ఆధ్యాత్మికత, ప్రేమానుబంధాల థీమ్స్ తో ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా సాగుతుంది. దాదాపు 600 యాడ్స్‌కు పైగా తెరకెక్కించిన ప్రసిద్ధ యాడ్ ఫిల్మ్ మేకర్ యమునా కిషోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారగా, జేకే ఆర్ట్స్ బ్యానర్‌పై జగదీష్ కుమార్ కాళ్లూరు నిర్మించారు. ఇందులో రేణు దేశాయ్‌ సరసన యువ నటుడు శంకర్ ఇందుచూడన్ కథానాయకుడిగా నటించారు. దివంగత లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గతంలో రచించిన ఒక అద్భుతమైన పాటను ఈ సినిమాలో ఉపయోగించడం ఈ మూవీకి హైలెట్ గా నిలిచింది. మరెందుకు ఆలస్యం ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ఫ్యాన్స్ ఇంట్లోనే కూర్చొని ఎంచక్కా చూసేయచ్చు.