నటి రేణు దేశాయ్ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్ తో ప్రేమ వివాహం, విడాకుల అనంతరం చాలా రోజుల తర్వాత రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. టీవీ షోలు, సినిమాలలో నటిస్తోంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు, తన పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన భారత్ – పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడారు.
Also Read : Kamala Hassan : ‘థగ్ లైఫ్’ ట్రైలర్ టైం ఫిక్స్!
పాకిస్తాన్ పై ప్రతీకారంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ అయ్యింది. అయితే పాకిస్తాన్ కు చైనా మద్దతు ప్రకటించడంతో ఈ విషయం పైన చాలా మంది సెలబ్రేటిలు మాట్లాడారు. ఇందులో భాగంగా రేణు దేశాయ్ కూడా స్పందిస్తూ.. ‘పాకిస్తాన్‌కు చైనా సపోర్ట్‌గా ఉన్న కారణంగా ఇకనుంచి ఎవరూ కూడా చైనా వస్తువులను కొనకూడదు. మీరు నిజంగానే దేశం గురించి, శాంతి భద్రతల గురించి ఆలోచించే వారే అయితే చైనాలో తయారయ్యే టువంటి ఎలాంటి వస్తువులు కూడా కొనకూడదు. వీటిని కొనడం పూర్తిగా మానేయండి. ఏ వస్తువు కొన్న దానిపై ఉన్న లేబుల్ ను చూడండి. షాప్ యజమానులకు ఈ వస్తువులు చైనావి అందువల్లనే మేము కొనడం లేదని వారికి తెలియజేయండి’ అని సోషల్ మీడియాలో రేణు దేశాయ్ తెలిపింది. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
