NTV Telugu Site icon

Release Clash : నితిన్ కు పోటిగా నాగ చైతన్య… చూస్కుందాం..!

Decemabar

Decemabar

పుష్ప -2  డిసెంబరు 6న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక డిసెంబరు లో వస్తుంది అనుకున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్ళిపోయింది. ఆ డేట్ లో రావాల్సిన మెగా స్టార్ విశ్వంభర సమ్మర్ కు వెళ్ళింది. అలాగే డిసెంబరు లో రిలీజ్ అవుతుంది అనుకున్న నందమూరి బాలకృష్ణ, బాబీ ల సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఆ విధంగా డిసెంబరు పంచాయితీ ఎటువంటి తర్జన భర్జన లు లేకుండా ముగిసింది.

Also Read : VenkyAnil3 : క్లైమాక్స్‌ షూట్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెనక్కి తగ్గేదే లేదు..

కాగా ఇప్పుడు డిసెంబరులో రిలీజ్ చేయాలనీ చూస్తున్న సినిమాల విషయంలో మరొక తకరారు మొదలైంది. బాలయ్య, చరణ్ తప్పుకోవడంతో ఆ డేట్ కోసం ఓ ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్ సినిమాను మైత్రి సంస్థ నిర్మిస్తోంది.మరొక యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ ను గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇందులో రాబిన్ హుడ్ ను డిసెంబరు 20న రిలీజ్ చేస్తునట్టు ప్రకటించారు. ఇప్పుడు అదే డేట్ కు నాగ చైతన్య తండేల్ ను కూడా రిలీజ్ చేయాలని గీతా కాంపౌండ్ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. 25న క్రిస్మస్ హాలిడే రావడం, 31న న్యూయార్ పబ్లిక్ హాలిడే కావడమంతో రెండు సినిమాలు ఒకే డేట్ కు రావాలని చూస్తున్నాయి. రెండు సినిమాలు వారి కెరీర్ కకు చాలా ముఖ్యం. తండేల్ ను చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ రూ. 75 కోట్లతో నిర్మిస్తున్నారు.

Show comments