Site icon NTV Telugu

Regina Cassandra : ‘నా తల్లే అడగడం లేదు.. మీకు ఎందుకు’- రెజీనా ఫైర్ !

Regina Cassandra

Regina Cassandra

టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన టాలెంటెడ్ నటి రెజీనా కసాండ్రా. 2005లో తమిళ చిత్రం ‘కండనాల్ మొదల్’తో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన రెజీనా, తెలుగులో ‘SMS (శివ మనసులో శృతి)’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో, ఆమె టాలీవుడ్‌లో అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ, కొంతకాలం తర్వాత విజయాల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ, ఆమె కెరీర్‌ను కొనసాగిస్తూ.. ప్రజంట్ మిడిల్‌రేంజ్ చిత్రాలలో అవకాశాలను దక్కించుకుంటూ, తన కెరీర్‌ను స్థిరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే..

Also Read :Nidhhi Agerwal : ‘పాపా.. మీ మమ్మి నంబర్ ఇవ్వు’.. నిధి అగర్వాల్‌కు నెటిజన్ షాకింగ్ కామెంట్!

సినీ రంగంలో అడుగు పెట్టి ఎంతో కాలం అయినప్పటికీ, పెళ్లి గురించి ఆమెకు ఎదురవుతున్న ప్రశ్నలు ఇంకా తగ్గడం లేదు. కానీ, తాజాగా ఆమె అందరికీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 34 సంవత్సరాలు, దీంతో పెళ్లి గురించి ప్రశ్నలు కూడా ఎక్కువయ్యాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన రెజీనా..”నా తల్లే నాకు పెళ్లి గురించి అడగడం లేదు. మరి మీకు ఎందుకు అంత అత్రుత?” అని కాస్త గట్టిగానే సమాధానమిచ్చారు. తన జీవితానికి సంబంధించి అనవసరంగా జోక్యం చేసే వారిపై ఈ సమాధానం కౌంటర్ అయింది. అలాగే, ‘నాతో ఎవరైనా రిలేషన్ పెట్టుకున్న వారికే కష్టం’ అంటూ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం రెజీనా మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version