Regina Cassandra: సినీ పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రెజీనా కసాండ్రా

Regina Cassandra

Regina Cassandra

అందం, అభినయం కలగలిసిన తార రెజీనా కసాండ్రా.. శివ మనసులో శృతి చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ ఆ తరువాత రొటిన్‌ లవ్‌స్టోరీ, కొత్తజంట, పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ చిత్రంతో తెలుగులో అగ్ర కథానాయికల జాబితాలో చేరింది. కేవల తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

Also Read : Anupama : పక్క స్టేట్లో ఇంత ఫేమస్ అవుతానని, ఇలాంటి ఒక లైఫ్ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు!

×
×
Ad

ఇటీవల అజిత్‌లో కలిసి నటించిన తమిళ చిత్రం విదా మయూర్చితో పాటు బాలీవుడ్‌ చిత్రం జాట్‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రెజీనా కసాండ్రా. ఇప్పటి వరకు అన్ని తరహా పాత్రలను పోషించిన ఈ అందాల భామ త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులతో ముందుకు రానుంది. భారతీయ సినీ పరిశ్రమలో ప్రవేశించి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో ఓ రెండు చిత్రాలతో పాటు తమిళంలో మూడు సినిమాలు, కన్నడ, హిందీ భాషల్లో రెండు చిత్రాలతో బిజీగా ఉంది