ఫీమెల్ యాక్టర్స్ సేఫ్‌గా కెరీర్‌ను బిల్ చేయడం అంటే మాములు విషయంకాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇలాంటి విషయాలు ఒక్కప్పుడు బయటకు చెప్పడానికి చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు, స్త్రీలపై వివక్ష గురించి రోజుకొకరు బాంబు పేలుస్తూ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ యాక్టర్ తను కూడా దారుణంగా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని తెలిపింది.
Also Read: Mohanlal : ఆయనతో మాట్లాడకపోతే నాకు రోజు గడవదు..
బాలీవుడ్ నటి నవీనా బోలే గురించి పరిచయం అక్కర్లేదు. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ భరత నాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చి. ఈ క్రమంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసి .. ఇండియాలో టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా నవీనా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టింది.. ‘మహిళా నటులతో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ ప్రవర్తన ఏమాత్రం బాగోదు.. ఆయన కారణంగా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. 20 ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ కోసం సాజిద్ టీమ్ నుంచి నాకు కాల్ రావడంతో ఆయనను కలవడానికి వెళ్లాను. మాట్లాడటానికి వెళ్తే బట్టలు తీసేసి కూర్చోమన్నాడు. ఒక్కసారిగా నాకు షాక్ తగిలినట్లయింది. భయంతో నా ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇంటికి వచ్చేశాను. ఈ సంఘటన తర్వాత నాకు వరుస ఫోన్ కాల్స్ చేశారు.. కానీ నేను స్పందించలేదు. జీవితంలో మరోసారి సాజిద్‌ను కలవకూడదని నిర్ణయించుకున్న’ అని తెలిపింది. ప్రస్తుతం నవీన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమవ్వగా, దీనిపై సాజిద్ ఖాన్ స్పందించాల్సి ఉంది.
