Site icon NTV Telugu

The Rajasaab : రెబల్ స్టార్ ‘రాజాసాబ్’ రిలీజ్ వాయిదా.. ఎక్స్ ఖాతలో నిర్మాత సంచలన పోస్ట్

Tg Vishwa Prasad

Tg Vishwa Prasad

అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంతో సంక్రాంతికి రాబోతున్న సినిమాలతో పాటు అనేక భారీ బడ్జెట్ సినిమాల విషయంలో టెన్షన్ మొదలైంది. వందల కోట్ల బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యం. కానీ అదే ఫైనాన్స్ క్లియర్ చేయకుంటే మాత్రం ఎంతటి స్టార్ హీరో సినిమా అయిన సరే వాయిదా పడాల్సిందే. అఖండ 2 వాయిదా నేపథ్యంలో టాలీవుడ్ లో మరొక న్యూస్ తెరపైకి వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సంక్రాంతికి రిలీజ్ అవడం లేదని బాలీవుడ్ సంస్థకు రాజాసాబ్ మేకర్స్ అయిన పీపుల్స్ మీడియా క్లియర్ చేయాల్సిన ఫైన్సాస్ పెండింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి.

Also Read : Akhanda2 : అఖండ 2 రిలీజ్ వాయిదాపై రాజాసాబ్ నిర్మాత ఆవేదన

రాజాసాబ్ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ఈ సినిమా విడుదల గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్న నేపధ్యంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ ‘ సినిమా విడుదలకు చివరి నిమిషంలో అంతరాయం కలిగించడానికి ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. ఇటువంటి చర్యలు తీవ్రంగా ఖండించాలి. రాజాసాబ్‌ మేకింగ్ కు తీసుకున్న ఫైనాన్స్ కు సంబంధించిన నిధులను పూర్తిగా క్లియర్ చేస్తాము. అలాగే వడ్డీలును కూడా అనుకున్న దాని కంటే ముందుగానే క్లియర్ చేస్తాం. మా రాజాసాబ్ తో పాటు వస్తున్న మన శంకర వర ప్రసాద్, భర్త మహాశయుకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, జన నాయగన్, పరా శక్తి మరియ ఇతర సంక్రాంతి రిలీజ్‌లు ఎటువంటి రిలీజ్ లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ కావాలి. అలాగే అన్ని సినిమాలు ఘనవిజయం సాధించాలి అని ట్వీట్ చేశారు.

Exit mobile version