కేరళలోని వయనాడ్ జిల్లాలో అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగావారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఊహించని ఈ పరిణామం దేశప్రజలను త్రీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. వయనాడ్ భాదితులకు సాయం చేసేందుకు సినీతారలు తమ వంతుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి రూ. 50లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు.
Also Read : Pawan Kalyan: పవన్ బర్త్ డే కానుకగా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న’OG’ టీమ్
మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ కేరళ వరద భాదితులు సహాయార్థం తమ వంతు భాద్యతగా కదిలి వస్తున్నారు. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. రెండు రోజుల క్రితం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిపి కోటి రూపాయల ఆర్థిక సాయం చేశారు. వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు కోలుకోవాలని పప్రార్ధించారు మెగాస్టార్. నేడు మరో టాలీవుడ్ స్టార్ వయనాడ్ భాదితుల కోసం ముందుకు వచ్చారు. అతడే మనందరి బాహుబలి ప్రభాస్ రాజు. కేరళలోని వయనాడ్ భాదితులను చూసి చలించిపోయిన ప్రభాస్ గాయపడిన భాదితుల చికిత్స సహాయార్ధం రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రభాస్ నటించిన సినిమాలు కేరళలో మంచి కలెక్షన్స్ రాబడతాయి. తనపై అంత అభిమానం చూపించే కేరళ ప్రజలి కష్టాలలో ఉంటె చలించి పోయి కదిలొచ్చాడు రెబల్ స్టార్. భారీ విరాళం ప్రకటించి మరోసారి రాజంటే ప్రభాస్ రాజు అని నిరూపించుకున్నాడు బాహుబలి.