NTV Telugu Site icon

Rebal Star : ‘స్పిరిట్’ లో ప్రభాస్ క్యారక్టర్ ఏంటో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit

Spirit

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కల్కి తో మరోసారి రెబల్ స్టార్ రేంజ్ ఏంటో చూపించిన ప్రభాస్ వరుసగా సూపర్ హిట్ దర్శకులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లేటెస్ట్ గా హాస్యం ప్రదానంగా ఉంటె సినిమాలు తెరకెక్కించే మారుతీ దర్శకుడిగా ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నాడు, అలాగే కథ బలం ఉన్న సినిమాలు చేసే హను రాఘవ పూడి దర్శకత్వంలో సినిమాకు ఇటీవల కొబ్బరికాయ కొట్టాడు.

Also Read : Nagavamsi : లక్కీ భాస్కర్ లో తప్పులు కనిపెడితే పార్టీ ఇస్తా..

ఈ రెండు సినిమాలతో పాటు సెన్సషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో “స్పిరిట్” అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి ఈ సినిమాను యానిమల్ కంటే ఇంకాస్త ఎక్కువ వైలెంట్ గా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. తాజాగా సందీప్ రెడ్డి వంగా పొట్టెల్ అనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఆ ఈవెంట్ లో ప్రభాస్ తో చేయబోయే సినిమా పోలీస్ స్టోరి అని తెలిపాడు సందీప్ రెడ్డి. ఎవరికీ తలవంచని ఒక డేషింగ్ డాషింగ్ పోలీస్ రోల్ లో ప్రభాస్ నటిస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ కెరియర్ లో మునుపెన్నడు చూడని విధంగా వైల్డ్ గా స్పిరిట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

Show comments