NTV Telugu Site icon

Rebal Star : ప్రభాస్ నెక్ట్స్ 5 సినిమాలు.. 5 విభిన్న కథలు..

Darling (3)

Darling (3)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఒకరకంగా చుస్తే ప్రభాస్ ఉన్నంత బిజీగా టాలీవుడ్ లో ఇతర హీరోలు ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు, అంత బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను ఓకే చేశారు. సాహూ, రాధేశ్యామ్. ఆదిపురుష్, సలార్ సినిమాలతో ఏడాదికి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు డార్లింగ్. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

Also Read : kanguva : సూపర్ స్టార్ అంటే ఆయన మాత్రమే..

కాగా ప్రభాస్ ప్రస్తుతం 5 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉండగా మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్నాయి. ఒకసారి ఆ సినిమాల వివరాలు పరిశీలిస్తే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. కెరీర్ లో తొలిసారి హారర్ కామెడీ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రజాకార్ల నాటి కాలానికి చెందిన కథ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేస్తున్నాడు. ఇక నాలుగవ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ సలార్ – 2, ఐదవ సినిమాగా కల్కి -2 భారతీయ పురాణాల ఇతిహాసాల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇలా రాబోవు 5 ఇనిమలు 5 విభిన్న కథలను ఎంచుకుని సరికొత్త పంధాలో సాగుతున్నాడు ప్రభాస్.

Show comments