Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల పుట్టినరోజుల సందర్భంగా వింటేజ్ క్లాసిక్లు, బ్లాక్‌బస్టర్ సినిమాలను థియేటర్లలో మళ్లీ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవల రీ-రిలీజ్ కావలసిన కొన్ని ఐకానిక్ చిత్రాలు చివరి నిమిషంలో వాయిదా పడుతుండటం నందమూరి, అక్కినేని, మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆయన కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ మాస్ ఎంటర్టైనర్ ‘ముఠామేస్త్రీ’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని మళ్లీ పెద్ద తెరపై చూసి ఎంజాయ్ చేయాలని థియేటర్ల వద్ద హంగామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే డిజిటల్ రీమాస్టరింగ్ పూర్తయిన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్‌లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తాయి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమా రీ-రిలీజ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
Also Read
- Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
కింగ్ నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆయన కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన కల్ట్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’ సినిమాను రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అంటే నేటికీ ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాకి కూడా సాంకేతిక లోపాలే అడ్డంకిగా మారాయి. 4K డిజిటల్ రీమాస్టరింగ్ పనుల్లో అవుట్‌పుట్‌లో లోపాలు రావడంతో ఆఖరి నిమిషంలో ‘గీతాంజలి’ రీ-రిలీజ్‌ను కూడా పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఎంతో ఆశగా ఎదురుచూసిన సినిమాలు సాంకేతిక కారణాల వల్ల రీ-రిలీజ్ కాకపోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా అప్సెట్ చేస్తోంది. ముందే అన్ని సాంకేతిక పనులను పూర్తి చేసుకుని ప్రకటనలు ఇస్తే బాగుంటుందని ఇలా చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం సరికాదని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
-
ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
-
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!