NTV Telugu Site icon

Re – Release : మురారి, ఇంద్ర రీరిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన.. గబ్బర్ సింగ్..

Untitled Design (2)

Untitled Design (2)

పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్‌ సింగ్‌’. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న ‘గబ్బర్ సింగ్‌’ రీ-రిలీజ్‌ కానుంది. ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీరిలీజ్ అయ్యాయి.

Also Read: Pushpa2TheRule : జెట్ స్పీడ్ లో పుష్ప రాజ్.. డిసెంబర్ 6న బాక్సాఫీస్ బద్దలే

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. గడచిన 24 గంటల్లో సినిమాటికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’ లో 27K టికెట్స్ బుక్ అయి పవన్ సినిమాకు ఉండే స్టామినా ఏంటో చూపించింది. ఇక అడ్వాన్సు బుకింగ్స్ కలెక్షన్స్ విషయంలో గబ్బర్ సింగ్ ఇంతకు ముందు రిలీజైన ఇంద్ర, మురారి, సింహాద్రి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. మురారి అడ్వాన్సు సేల్స్  రూ. 3.46 కోట్లు రాబట్టగా, గబ్బర్ సింగ్ ఆ రికార్డును బద్దలు కొట్టి 4 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఒక్క కర్ణాటకలోనే గబ్బర్ సింగ్ 29.6 లక్షల అడ్వాన్స్ సేల్స్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను గబ్బర్ సింగ్ కలెక్షన్స్ లో సత్తా చాటుతోంది. నైజాంలో ఈ చిత్రాన్నీ భారీ స్థాయిలో రీరిలీజ్ చేస్తున్నారు. ఫైనల్ రన్ లో ఈ చిత్రం రీరిలీజ్ సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టి అల్ టైమ్ రికార్డు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.

Show comments