బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘ఆర్ సి 16’. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్ గురించి చర్చ జరుగుతోంది. పవర్ క్రికెట్ నేపథ్యంలో రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా ఉండబోతోంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే కెమెరామెన్ రత్నవేలు లీక్ చేశారు. ఇక ద్వితియార్ధంలో కుస్తీ ఆటతో కథ నడుస్తుందని అంటున్నారు.
Nani: నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ రెడీ..!
ఈ క్రమంలోనే క్రికెట్-కుస్తీ రెండూ కలిసి వచ్చేలా టైటిల్ పెట్టాలని ఆలోచనలో ఉన్నారు మేకర్స్. గతంలో పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉండగా వర్కింగ్ టైటిల్ ఐతే – పవర్ క్రికెట్ గా ఉండబోతోంది అని అంటున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ఫ్యాన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో తన తదుపరి సినిమా ‘ఆర్ సి 16’ పై గట్టిగా ఫోకస్ చేస్తున్నారు చరణ్.