Site icon NTV Telugu

RC 16 : రామ్ చరణ్ కొత్త సినిమాలో నటించాలని ఉందా? ఈ అవకాశం మీకోసమే…

Ram Charann (4)

Ram Charann (4)

గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.. అటు భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉండటంతో చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది.. దీంతో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. గేమ్ ఛేంజర్ అనంతరం రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో మూవీ చేయనున్నాడు. రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పని మొదలైంది.

కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. నిర్మాతలు కీలక అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ 16వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వనున్నారు.. అందుకోసం ఆడిషన్స్ ను కూడా నిర్వహించనున్నారు.. తాజాగా ఈ ఆడిషన్స్ కోసం ఒక పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది…ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో నడిచే విలేజ్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ఈ క్రమంలో అక్కడి స్థానిక నటుల కోసం వేట మొదలైంది. స్త్రీ, పురుషులు, చిన్న పిల్లలు… అన్ని ఏజ్ గ్రూప్స్ కి చెందినవారు ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని తెలియజేశారు. కాబట్టి రామ్ చరణ్ మూవీలో నటించాలని కోరుకుంటున్నవారికి ఇది సువర్ణ అవకాశం..

ఇకపోతే ఫిబ్రవరి 5 నుండి 17 వరకు వరుసగా విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఆడిషన్స్ జరగనున్నాయి. కాగా ఉప్పెన మూవీతో బుచ్చిబాబు భారీ విజయం సొంతం చేసుకున్నాడు. ఏకంగా రెండో చిత్రంతోనే రామ్ చరణ్ వంటి టాప్ స్టార్ తో ఛాన్స్ పట్టేశాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం..

Exit mobile version