Rayavalasa : అమెరికా నుంచి వచ్చి.. పక్కా పల్లెటూరి కథతో సెన్సేషన్!

Rayavalasa

Rayavalasa

అమెరికాలో స్థిరపడిన ఓ మహిళ దర్శకురాలుగా  ఆమె కుమారుడు హీరోగా మారి.. ఓ పక్కా రా అండ్ రస్టిక్ గ్రామీణ వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా తీయడం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వంలో, అమెరికా నుంచి వచ్చిన కార్తీక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘రాయవలస’. తాజాగా దసరా పండుగ కానుకగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేస్తూ సంచలనం సృష్టించారు.

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ జె ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. దసరా సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అమ్మవారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంటెన్స్ అండ్ సీరియస్ లుక్‌తో ఉన్న హీరో పోస్టర్ వైబ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీషా నులు ‘రాణి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో హీరోయిన్‌గా నటిస్తోంది.

గ్రామీణ వాతావరణం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమాను చిత్ర బృందం కేవలం ఒకే ఒక్క భారీ షెడ్యూల్‌లో పూర్తి చేయడం మరో విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘రింగుడు రింగుడు’ సాంగ్ యూట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్‌తో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అర్జున్ బాల సంగీతం, వి.ఆర్.కె. నాయుడు సినిమాటోగ్రఫీ, గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ ఈ చిత్రానికి అదనపు బలాన్ని చేకూర్చాయి. అన్నపూర్ణమ్మ, జయప్రకాశ్, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం, డిసెంబర్ 11న బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.