టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. నూతన నటుడు కార్తిక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం “రాయవలస”. ఇప్పటికే విడుదలైన టీజర్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర బృందం.. తాజాగా మైండ్ బ్లాంక్ అయ్యే ఒక సంచలన పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ వైల్డ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. కొత్త హీరో అయినా.. ఎంట్రీతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా కనిపిస్తున్నాడు కార్తిక్ జయంతి. మేకర్స్ తాజాగా వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టర్‌లో అమ్మవారి విగ్రహం ముందు నిలబడి, చేతిలో త్రిశూలం పట్టుకుని కార్తిక్ జయంతి ఇచ్చిన పోజు చూస్తుంటే ఎవరికైనా గూస్‌బంప్స్ రావాల్సిందే. ఆ పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ లుక్ చూస్తుంటే.. సినిమాలో భారీ స్థాయిలో యాక్షన్, గూస్ బంప్స్ తెప్పించే గూఢమైన కథా నేపథ్యం, ఊహించని మలుపులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
విశేషమేమిటంటే.. ఇంతటి పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌ను ఒక మహిళా దర్శకురాలు రాధిక జయంతి తెరకెక్కిస్తుండటం. తొలి సినిమాతోనే హీరోను ఇంత మాస్‌గా ప్రజెంట్ చేస్తున్న దర్శకురాలి టేకింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. RaysuN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత గోపీ కృష్ణ జె ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీగా నిర్మిస్తున్నారు. అంతేకాక ఈ సినిమా హీరో తల్లే డైరెక్టర్ కావడం. ఈ చిత్రంలో కార్తిక్ జయంతి సరసన శ్రీష నులు హీరోయిన్‌గా నటిస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, సినిమాకు బలమైన స్టోరీలైన్, సీనియర్ నటీనటుల సపోర్ట్ ఉంది. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ లాంటి సీనియర్లతో పాటు.. యువ నటులు సుహాస్, కంచరపాలెం రాజు, త్రినాధ్ రావు ఈ చిత్రంలో అత్యంత కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు అర్జున్ బాలా అందించిన మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పూర్ణ చారి, కార్తిక్ జయంతి, తరుణ్ సైదులు రాసిన సాహిత్యాకి.. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రమ్య బెహరా లాంటి టాప్ సింగర్స్ తమ గొంతుతో ప్రాణం పోశారు. మొత్తానికి భావోద్వేగం, శివమెత్తే యాక్షన్, అద్భుతమైన సంగీతం కలగలిపిన కంప్లీట్ ప్యాకేజీగా రాబోతున్న “రాయవలస” నవంబర్ 20న థియేటర్లలో ఎలాంటి జాతర సృష్టిస్తుందో చూడాలి.

