Mr. Bachchan : రవితేజ “మిస్టర్ బచ్చన్” షూటింగ్ అప్డేట్ వైరల్..

Whatsapp Image 2024 05 08 At 10.08.41 Am

Whatsapp Image 2024 05 08 At 10.08.41 Am

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ,వాల్తేరు వీరయ్య సినిమాతో మరో హిట్ ను అందుకున్నారు.అయితే ఆ తరువాత నటించిన రావణాసురుడు,టైగర్ నాగేశ్వరరావు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.అయితే రవితేజ నటించిన రీసెంట్ మూవీ “ఈగల్” కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు..కానీ రవితేజ యాక్షన్ కు మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘నామ్‌తో సునాహోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీశ్‌శంకర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ సినిమాని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ ఇటీవల దర్శకుడు హరీశ్‌శంకర్‌ ఈ సినిమాకు సంబంధించి మేజర్‌ టాకీ పార్ట్‌ షూటింగ్ ఉత్తరప్రదేశ్‌ మరియు హైదరాబాద్‌ లో పూర్తి చేశారు. ఇక సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్‌ వున్నాయి.సాంగ్స్ షూటింగ్ కోసం ఈ వారం చిత్రయూనిట్‌ ఆమెరికా వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం హరీశ్‌శంకర్‌ అమెరికాలోనే ఉన్నారని సమాచారం. లొకేషన్‌ సెర్చింగ్‌ కోసం ఆయన అక్కడ బసచేసినట్టు తెలుస్తున్నది.ఈ సినిమాకు మిక్కీ జె.మేయర్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.