NTV Telugu Site icon

RT 75 : రవితేజ ‘మాస్ జాతర’ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.

Raviteja

Raviteja

మాస్ మహారాజ ర‌వితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు.  గతేడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ కు భంగపాటు ఎదురైంది. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భాను బోగ‌వ‌రపు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాను ‘ మాస్ జాతర’ అనే టైటిల్ తో వస్తున్నాడ. బడా నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Also Read : Gopichandh Malineni : సన్నీ డియోల్ ‘JAAT’ రిలీజ్ డేట్ వచ్చేసింది

తెలంగాణ నేప‌థ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెర‌కెక్కనున్నట్టు సమాచారం. ల‌క్ష్మ‌ణ్ భేరి అనే పాత్ర‌లో మాస్ మ‌హారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రవితేజ గాయం కారణంగా వాయిదా పడిన షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో జరుగుతోంది. అరకు లో షెడ్యూల్ స్టార్ట్ కూడా ఫినిష్ చేసారు. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ జనవరి 17 నుండి హైదరాబాద్ లో స్టార్ట్ చేసాడు దర్శకుడు భాను భోగవరపు. ఇప్పటివరకు జరిగిన ఈ సినిమా దాదాపు 80% వరకూ కంప్లీట్ అయ్యింది. నేడు మాస్ జాతర టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. మాస్ మహారాజ బర్త్ డే సందర్భంగా జనవరిలో 26న ‘ మాస్ జాతర ‘ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ధమాకా వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రవితేజకు మాస్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.