Site icon NTV Telugu

Ravi Teja : ఆ వార్తల్లో నిజం లేదు.. ఇదే నిజం..

Ravi Teja

Ravi Teja

Mass Maharaja Ravi Teja Clarity about His Remuneration Issues.

మాస్‌ మహారాజ రవితేజ హీరో నటిస్తున్న కొత్త చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. ఈ సినిమాను ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అయితే రెమ్యునరేషన్‌ విషయంలో రవితేజ చాలా ఖచ్చితంగా ఉంటాడని, నిర్మాతలను వేధిస్తాడంటూ ‘రామారావు ఆన్ డ్యూటీ’ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ.. రవితేజ రెమ్యునరేషన్‌ గురించి కొన్ని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. దీంతో పుకార్లు నిజం కాదని మాస్‌ మహారాజనే క్లారిటీ ఇచ్చారు. పుకార్లపై రవితేజ స్పందిస్తూ… ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీకి’ తాను కోప్రొడ్యూసర్ ని అని… అలాంటప్పుడు రెమ్యునరేషన్ సమస్య ఎక్కడి నుంచి వస్తుందని రవితేజ స్పష్టం చేశారు.

 

నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు… వారిచ్చిన చెక్ లను తాను చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయని రవితేజ తెలిపారు. వెబ్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్ర లోకేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రవితేజ హీరో ఇటీవల విడుదలైన ఖిలాడీ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే ‘రామారావు’ సినిమానైనా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.

 

Exit mobile version