Site icon NTV Telugu

‘రాజా ది గ్రేట్’ సీక్వెల్ కు అనిల్ రావిపూడి సన్నాహాలు…?

Ravi Teja and Anil Ravipudi to join hands for Raja The Great sequel

మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ‘రాజా ది గ్రేట్’ తరువాత హిట్ కరువైన రవితేజకు ‘క్రాక్’ మళ్ళీ మునుపటి జోష్ ను ఇచ్చింది. అదే స్పీడ్ తో ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నాడు రవితేజ. అయితే గతంలో కూడా వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ‘రాజా ది గ్రేట్’తో సూపర్ హిట్ ను ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ‘రాజా ది గ్రేట్’ మేటర్ ఎందుకంటే… మరోసారి రవితేజతో ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్ కోసం అనిల్ రావిపూడి సన్నాహాలు మొదలెట్టారట. ఇటీవల రవితేజను కలిసి స్టోరీ లైన్ ను వినిపించారట అనిల్ రావిపూడి. అయితే రవితేజకు కూడా బేసిక్ లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని అనిల్ రావిపూడితో చెప్పారట. అనిల్ రావిపూడి ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేశాక ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ పని ప్రారంభిస్తాడు. ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్ వచ్చే ఏడాది చివర్లో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. కాగా అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే.

Exit mobile version