వన్స్ ఆపాన్ ఎ టైమ్ తన గ్లామరస్ షోతో బాలీవుడ్‌ను షేక్ చేసిన బ్యూటీ రవీనాటాండన్. బీటౌన్‌లో కాదు.. సౌత్‌లోనూ అడపాదడపా చిత్రాల్లో వర్క్ చేసింది. బాలయ్యతో స్వాతిలో ముత్యమంతా ముద్దుల ముట్టుకుంది సంధ్యవాన సాంగ్ తో ఒక ఊపు ఊపేసింది రవీనా. ప్రజెంట్ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ చాలా రోజుల తర్వాత కేజీఎఫ్2లో రమికా సేన్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో నటించి మళ్లీ సౌత్ ప్రజలతో టచ్‌లోకి వచ్చేసింది భామ. కానీ ప్రజెంట్ ఆమె టెన్షన్ అంతా కూతురిపైనే.
Also Read : KARTHI 29 : మరో సినిమా స్టార్ట్ చేసిన కార్తీ.. టైటిల్ ఇదే
ఇప్పటికే బాలీవుడ్ తెరంగేట్రం చేసిన రాషా తడానీ సౌత్ ఇండస్ట్రీలోకి తెద్దామని ట్రై చేస్తే బెడిసికొట్టింది. మోక్షజ్ఞను హీరోగా ఇంట్రడ్యూసే చేసే బాధ్యతను హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మకు అప్పగించాడు బాలకృష్ణ. ఇదిగో ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ స్టార్ట్ కాబోతుందని ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. మోక్షు సరసన రవీనా డాటర్ రాషా తడానీని ఫిక్స్ చేయబోతున్నారన్న టాక్ స్ప్రెడ్ అయ్యింది. కానీ చివరికీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అసలు ప్రాజెక్ట్ ఉందో కూడా క్లారిటీ లేదు. ఈ సినిమాతోనే కూతుర్ని టాలీవుడ్ తెరంగేట్రానికి ప్రిపేర్ చేసే ప్లాన్ బెడిసికొట్టంది రవీనాకు. దీంతో ప్లాన్ బి అమలు చేస్తోంది సీనియర్ భామ. తెలుగులో కూతురు ఇంట్రడక్షన్ ఫెయిలైతే ఏంటీ నేను రంగంలోకి దిగుతానంటోంది రవీనా. సదరన్ ఇండస్ట్రీపై గట్టిగానే ఫోకస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతోంది. వెంకీ అట్లూరీ,సూర్య ప్రాజెక్టుతో పాటు విజయ్ ఆంటోనీ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేస్తోంది ఈసీనియర్ యాక్ట్రెస్. మొత్తానికి డాటర్ అండ్ మదర్ ఎవరి స్కెచ్ వాళ్లు వేసుకుంటున్నట్లే కనిపిస్తోంది.
