రవీనా టాండర్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా బాలీవుడ్ హీరోయిన్ ఆమె కూడా ఒకరు. ఇప్పటికీ అవకాశాలు వచ్చినప్పుడల్లా సౌత్ లో నటిస్తోంది. కానీ కోలీవుడ్‌కి మాత్రం బాగా దూరమైంది.. ఆమె కోలీవుడ్లో సినిమాలు చేసి రెండు దశాబ్దాలు దాటింది. కన్నడ..తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించినా.. తమిళంలో మాత్రం నటించడం లేదు. మరి అవకాశాలు రాక చేయలేదా? కారణం ఏంటీ అన్నది తెలియదు. కానీ..
Also Read : Allari Naresh : సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో అల్లరి నరేష్..
తాజా సమాచారం ప్రకారం విజయ్ ఆంటోనీ కథానయకుడిగా స్వీయా నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘లాయర్’’ అనే సినిమా తెరకెక్కుతోంది. జాషువా సేతురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం రవీనా టాండన్ తో సన్నాహాలు జరిపారట.. కథ నచ్చడంతో ఆమె కూడా ఒకే చెప్పింది. ఆ పాత్ర విజయ్ రోల్ కి ధీటుగా ఉంటుందని సమాచారం. అయితే 1999లో రవీనా టాండన్ నటించిన ‘శూల్’ చిత్రంలో ఆమె నటన ఎంతగానే నచ్చిందని… అటుపై తాను దర్శకుడు అయిన తర్వాత ఎప్పటి కైనా ఆమెతో సినిమా చేయాలని ఉండేదని ఇప్పుడా కోరిక తీరుందని దర్శకుడు అభిప్రాయపడ్డాడు.
