కోలీవుడ్ స్టార్ ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం ‘కుబేర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న కుబేర.. మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. ఈ మూవీ ద్వారా నాగ్ లో కొత్త కోణం కనిపించింది. ఇక ధనుష్ యాక్టింగ్ కి తెలుగు ప్రేక్షకులు అయితే ఫిదా అయ్యారు. ఇందులో సమీరా పాత్రలో నటించిన రష్మిక కూడా ప్రేక్షకులను మెప్పించింది. అయితే తాజాగా తన కోస్టార్ ధనుష్ గురించి ఒక ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది రష్మిక.
Also Read : Trisha : మహేశ్ బాబుతో నటించేటప్పుడు కాస్త గిల్టీగా ఫీల్ అయ్యా..
‘మీతో అంత పెద్ద సినిమా చేసినప్పటికీ మనిద్దరిది ఒక్క సెల్ఫీ మాత్రమే ఉంది. మీరు అద్భుతమైన వ్యక్తి, మనం మట్లాడుకున్న ప్రతిసారీ వేర్వేరు నగరాల్లో ఉన్నాం. ఇద్దరం వేర్వేరు పనులు చేసుకుంటూ మాట్లాడుకునేవాళ్లం. విశ్రాంతి ఎంత ముఖ్యమో చర్చించేవాళ్లం. కానీ, విశ్రాంతి మాత్రం తీసుకోలేదు. కుబేర నటనపరంగానే కాదు.. నిజ జీవితంలోనూ మీరు చేసే పనులు ఎంతోమందికి ఆదర్శం. చుట్టూ ఉన్న వారితో ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. ముఖ్యంగా మీరు సెట్‌ల్లో నాకోసం తెచ్చిన లడ్డులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నాకు తమిళ డైలాగుల్లో మీరు చేసిన సహాయం.. నేను ఏదైనా డైలాగ్ చెప్పినప్పుడు మీరు ప్రశంసించిన తీరు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కావచ్చు. కానీ, జీవితమంతా గుర్తుంటాయి’ అంటూ ధనుష్ దిగిన సెల్ఫీ ని షేర్ చేశారు రష్మిక. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
