Site icon NTV Telugu

Rashmika : మనిషిలో మార్పు సహజం.. ఎవరిని గుడ్డిగా నమ్మకండి

Rashmika

Rashmika

ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. భాషతో సంబంధం లేకుండా వరుస విజయాలు అనుకుంటున్నా ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ, కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రష్మిక మందన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా రష్మిక నెట్టింట వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కొన్ని సలహాలు, సూచనలు ఇస్తూ.. ఫ్రెండ్స్‌ని అంత ఈజీగా నమ్మొద్దు.. ఈరోజు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్లు రేపు కాకపోవచ్చు అని ఇలా చెప్పుకుంటూ పోయింది. ఉన్నట్టుండి ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది.. అసలు ఆమె ఏం చెప్పిందో చూద్దాం ..

Also Read : Simbu : మణిరత్నం నన్ను పూర్తిగా మార్చేశాడు..

‘మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో వారితో జాగ్రత్తగా ఉండండి. ఇది మీ కోసమే. ఈ ప్రపంచంలో ఎవరు చెడ్డవారు కాదు కానీ.. అలా అని వారు మీకు మంచి వ్యక్తి కాకపోవచ్చు. ఈ రోజు స్నేహితులుగా ఉన్న వ్యక్తులు రేపు మీ మిత్రులు కాకపోవచ్చు. లేకపోతే వారే జీవితం మొత్తం మీకు తోడుగా ఉండవచ్చు. అది మీరు ఎంపిక చేసుకునే విధానం పై ఆధారపడి ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ కి చెప్పాలనుకుంటుంది ఒక్కటే . వీళ్ళైనంత వరకు మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీమల్ని ఈ ప్రపంచంలో ఎక్కువగా ప్రేమించే వారే. అందుకే వారు ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చిన వినండి. మంచి విషయం అయిన కూడా వారి సహాయం తీసుకోండి. ఎప్పుడూ తల్లిదండ్రులను తేలికగా తీసుకోవద్దు.’ అని ఆ పోస్ట్‌ల్లో రాసుకొచ్చింది. దీంతో సడేన్ గా రష్మిక ఎందుకు ఇలా మాట్లాడింది అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు.

Exit mobile version