Site icon NTV Telugu

Rashmika : బంధం బలంగా ఉండాలంటే ఒకే ఒక రూల్ చాలు..

Rashmika

Rashmika

ప్రజంట్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన. సక్సెస్‌లతో దూసుకపోతున్న ఈ ముద్దుగుమ్మ క్షణం తీరిక లేకుంగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో క్రేజీ స్టార్‌గా మారిపోయిన రష్మిక.. ఆయుష్మాన్ ఖురానా తో ‘థామా’ అనే చిత్రంలో  బిజీగా ఉంది. ఇది హారర్ మూవీ కావడంతో గత కొన్ని రోజుల నుంచి నైట్ షూట్ అంటూ తిరుగుతోంది. ఇక మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే. రౌడి హీరో విజయ్, రష్మిక ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారన్నే వార్తలు ఎప్పటి నుంచో వింటున్నాం. చాలా సార్లు వీరిద్దరు మేము జస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన.. ఏ వెకేషన్‌లకు వెళ్లినా ఇద్దరు కలిసే వెలతారు. ఇద్దరూ ఒకే చోట ఉంటారు.. కానీ వేర్వేరు ఫొటోలను షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా రష్మిక రిలేషన్ షిప్ గురించి ఓ పోస్ట్ పెట్టింది..

Also Read : Trump : అతిథి పాత్రలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

రష్మిక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమెకు సంబంధించిన ప్రతి ఒక అప్ డేట్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా  ‘రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే పాటించాల్సిన రూల్ ఏంటో తెలుసా? ఎప్పుడూ ఏ క్షణం అయినా సరే ఒంటరిగా బాధపడే రోజు రాకుండా చూసుకోవాలి.. కష్టసుఖాల్లో ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయి విడవద్దు అనే రూల్ పెట్టుకుంటే చాలు’ అని ఎక్కడో వచ్చిన ఓ పోస్ట్‌ను, తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.   అంతే కాదు  ‘ఈ రూల్‌ని నేను కూడా నేను కూడా అంగీకరిస్తున్నా.. ఒప్పుకుంటున్నా’ అని రష్మిక రాసుకొచ్చింది. అంటే బంధం పట్ల తనకున్న క్లారిటీ క్లియర్ గా కనిపిస్తుంది.

Exit mobile version