NTV Telugu Site icon

Rashmika Mandanna : నొప్పిని భరిస్తూ జిమ్ లో కష్టపడుతున్న రష్మిక..

Rashmikaa

Rashmikaa

టాలివుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. తన ఫిజిక్ ను ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉంచేందుకు తెగ ప్రయత్నిస్తుంది.. సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా జిమ్ లో నొప్పిని భరిస్తూ కష్ట పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్, నార్త్ లో భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన సినిమాల కోసం ఈ ముద్దుగుమ్మ చాలా శ్రమిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో తన గురించిన అప్డేట్స్ అందిస్తోంది.. ఈమేరకు ఈ అమ్మడు వర్కౌట్ సెషన్ నుంచి ఓ వీడియోను పంచుకుంది. అందులో లెగ్స్ వర్కౌట్ చేస్తూ కనిపించింది. హెవీ వెయిట్ ను కాళ్లతో లిఫ్ట్ చేస్తూ కండరాలను మరింత బలంగా మారుతోంది. మరింత ఫిట్ గా ఉండేందుకు తెగ కష్ట పడుతుంది..

రష్మిక ఎప్పుడూ ఫిట్ కనిపించేందుకు వ్యాయామం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. సాధారణంగా గ్లామర్ ఫీల్డ్ లో కొన్నేళ్ల పాటు వెలుగొందాలంటే బ్యూటీతో పాటు ఫిట్ నెస్ చాలా అవసరం. ఈ విషయంలో ఫిజికల్ గా ఎప్పుడు ఫిట్ గా కనిపించడంలో రష్మిక ముందుంటుంది. తన ఫిట్ నెస్ ఆకట్టుకుంటూ ఉంటుంది. అంత నాజుగ్గా ఉండాలంటే ఇలా గంటల కొద్ది జిమ్ లో శ్రమిస్తుందని అర్థమవుతోంది..భరించలేని నొప్పితో కూడిన వర్కౌట్స్ చేస్తుండటం, వెండితెరపై మరింత ఫిట్ గా, అందంగా మెరిసేందుకు ఆమె చేస్తున్న కృషికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప2 : ది రూల్’ చిత్రంలో నటిస్తోంది. రెయిన్ బో లో కూడా నటిస్తుంది.. అలాగే బాలీవుడ్ స్టార్ ‘యానిమల్’లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే..