NTV Telugu Site icon

Rashmika Mandanna : అందుకే ఆ ఈవెంట్లలో ఇంగ్లీష్ లో మాట్లాడను..

Rashmika (1)

Rashmika (1)

Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాగ శౌర్య హీరోగా నటించిన “ఛలో” మూవీతో ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో రష్మికకు వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది.పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా సూపర్ హిట్ కావడంతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది.ఈ భామకు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి.రీసెంట్ గా ఈ భామ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Read Also : Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?

ఈ సినిమాలో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.ఇలా వరుసగా బడా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ప్రస్తుతం రష్మికకు నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక తెలుగులో మాట్లాడటంతో అర్ధం కానీ ఓ అభిమాని ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఎక్స్ ద్వారా రిక్వెస్ట్ చేసాడు.ఆ రిక్వెస్ట్ కు స్పందించిన రష్మిక .. సినిమా ఈవెంట్స్ లో ఇంగ్లీష్ లో మాట్లాడకపోవడానికి గల కారణాలను తాజాగా  తెలిపింది.ఎంతో మంది అభిమానులు నేను వారి భాషలో మాట్లాడాలని కోరుకుంటారు.అందుకే నాకు భాష రాకపోయినా కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను.ఇంగ్లిష్ లో మాట్లాడి వారిని అగౌరవపరచాలని నేను కోరుకోను అని రష్మిక తెలిపారు.