బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రిష్ ఫ్రాంచైజీ నాల్గవ భాగం (క్రిష్ 4)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా హృతిక్ రోషన్ నటించనుండగా, దర్శకుడిగానూ ఆయనే బాధ్యతలు చేపట్టబోతున్నారని సమాచారం. అంతే కాదు ఈ చిత్రం 2026లో సెట్స్‌పైకి వెళ్లి, 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందట. గత మూడు సినిమాల మాదిరిగానే ఇందులో కూడా సూపర్ హీరో ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో హీరోయిన్‌గా..
టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఎంపిక చేసే దిశగా యూనిట్ సీరియస్‌గా ఆలోచిస్తోందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే రష్మికతో బృందం సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. ఆమెకు కథ, పాత్ర నచ్చితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. క్రిష్ 4 భారీ స్థాయిలో రూపొందనున్న నేపథ్యంలో, రష్మిక ఎంట్రీ ప్రాజెక్ట్‌కు మరింత ఆకర్షణను తీసుకురావడం ఖాయం. ఇక రష్మిక హృతిక్ జోడీగా స్క్రీన్‌పై కనిపిస్తే అది కొత్త ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విశేష అభిమానులను సంపాదించిన రష్మికకు ఇది బాలీవుడ్‌లో మరింత స్థాయిలో గుర్తింపుని తెచ్చే అవకాశం అని చెప్పవచ్చు. ఇక అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
