NTV Telugu Site icon

Rashmika: ఇప్పుడు కాస్త హైపెక్కించుకుందాం అంటున్న రష్మిక

Rashmika Mandanna

Rashmika Mandanna

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలను మరింత పెంచేలా ఇప్పటికే సినిమా నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అంతేకాదు సినిమాకి పనిచేసిన వాళ్ళు సినిమా చూసినవాళ్లు కూడా ఇది ఒక అద్భుతమైన సినిమా అని భారతీయ సినీ చరిత్రలో అనేక రికార్డులు బద్దలు కొట్టబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాకి హైప్ ఎక్కించగా ఇప్పుడు రష్మిక కూడా తన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా మీద హైప్ ఎక్కించే ప్రయత్నం చేసింది. ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో తాను సినిమాకి డబ్బింగ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ డబ్బింగ్ పూర్తయిందని, సెకండ్ హాఫ్ డబ్బింగ్ చెబుతున్నానని చెప్పుకొచ్చింది.

Dil Raju : డిజాస్టర్ల హీరోతో దిల్ రాజు సినిమా ప్లానింగ్

సినిమాకి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ అయితే అద్భుతంగా వచ్చింది. సెకండ్ హాఫ్ కూడా అంతకుమించి ఉండేలా ఉంది, నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మీరు త్వరలో మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆమె షేర్ చేసిన దానిలో ఫోటోలలో ఆమె డబ్బింగ్ చెబుతూ కనిపిస్తోంది. డిసెంబర్ 5వ తేదీన సినిమాని రిలీజ్ చేయబోతున్న నేపద్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టిన యూనిట్ సినిమా ట్రైలర్ ని మునుపెన్నడూ లేని విధంగా బీహార్ రాజధాని పాట్నా అటవీ ప్రాంతంలో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 17వ తేదీన అంటే ఆదివారం నాడు ఈ ట్రైలర్ లాంచ్ ఉండబోతోంది.

Show comments