NTV Telugu Site icon

ముంబైకి చేరుకున్న రష్మిక…!

Rashmika Mandanna

Rashmika Mandanna

కన్నడ సోయగం రష్మిక మండన్న షూటింగ్ కోసం తిరిగి ముంబై చేరుకుంది. కరోనా వ్యాప్తి తగ్గడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులను ప్రకటించింది. దీంతో బాలీవుడ్ చిత్రనిర్మాతలు తమ సినిమాల షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్ “గుడ్‌బై” షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి రష్మిక మండన్న ఈరోజు ముంబైలో అడుగుపెట్టింది. “గుడ్‌బై” చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘సూపర్ 30’ ఫేమ్ వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఇక రష్మిక మొదటి బాలీవుడ్ చిత్రం “మిషన్ మజ్ను”. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాలతో కూడా బిజీగా ఉంది. తెలుగులో అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది.

Show comments